Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు కూల్చేశారు. మొత్తం 8 టవర్లను రెండు దశల్లో కూల్చివేతలు చేపట్టారు. ముందు నాలుగు టవర్లు కూల్చిన అధికారులు.. తర్వాత మరో నాలుగింటిని కూడా ఒకేసారి కూల్చేశారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది.
యఓఎంఎం కర్మాగారం మూతపడడంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం అనుకుంది. ఈ క్రమంలోనే పాత కర్మగారానికి సంబంధించిన ఎనిమిది కూలింగ్ టవర్లను అధికారులు తొలగించారు. ఈ మేరకు ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చివేతలు చేపట్టారు.
కొద్దిరోజుల్లో కూల్చి వేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. దీంతో కూలింగ్ టవర్లు నెలకొల్పిన ప్రాంతం కేటీపీఎస్కు సద్వినియోగపడనుంది. టవర్లు పేల్చిన సమయంలో పరిసర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తం చేశారు.