Not Stopping Buses : నాగర్ కర్నూల్(Nagarkurnool) జిల్లా లింగాల మండలం మాడాపూర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బస్సులు ఆపడం లేదని కొందరు మహిళలు(Women’s) ఆదివారం రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మాడాపూర్లో ఆర్టీసీ బస్సులు(RTC Buses) ఆపకుండా వెళ్లడంతో నిరసన తెలిపారు. గతంలో తమ గ్రామంలో బస్సులు ఆపేవారని.. కానీ ఇప్పుడు ఆపకుండా వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: నిప్పులా కుంపటిలా తెలంగాణ.. ఆ 6 జిల్లాల్లో ..
మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండటం వల్లే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని ఆరోపణలు చేశారు. అందుకే తాము రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన చేశామని చెప్పారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని.. తమ గ్రామంలో బస్సులు ఆపాలంటూ డిమాండ్ చేశారు.
Also Read: పార్లమెంటు ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రూ.104 కోట్లు స్వాధీనం