Chandrababu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినీ ప్రస్థానం మొదలై నేటితో 50 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపీలో భారీ వర్షాల (Heavy Rains) కారణంగా ఏర్పడిన సమస్యల నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) లో జరుగుతున్న బాలయ్య సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోతున్నాని ట్వీట్ చేశారు.
సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను.…
— N Chandrababu Naidu (@ncbn) September 1, 2024