NBK 109 Balakrishna Birth Day Glimpse : టాలీవుడ్ (Tollywood) యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘NBK 109’. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ మూవీ అంచనాలను పెంచుతున్నాయి.
మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేరిన ‘NBK 109’ గ్లింప్స్ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక నేడు బాలయ్య బర్త్ డే (Birthday) సందర్భంగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్. బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ చిన్న గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసింది.
Also Read : ఇట్స్ అఫీషియల్, బోయపాటి – బాలయ్య మాస్ కాంబో రిపీట్ – ఈసారి అంతకుమించి!
మాన్స్టర్ వచ్చేశాడు…
‘NBK 109’ మూవీ టీమ్ తాజాగా సోషల్ మీడియాలో ‘మాన్స్టర్ వచ్చేశాడు’… అంటూ బర్త్ డే గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ వీడియోని గమనిస్తే.. ” దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది. జాలి.. దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు”.. అంటూ సాగే డైలాగ్స్‌తో గ్లింప్స్ సాగింది.
ఇక చివర్లో రైల్వే స్టేషన్ లో పొగ మంచులో బాలయ్య రెండు చేతుల్లో బ్యాగ్స్ తో నడుచుకుంటూ వస్తున్న లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా కనిపించనుండగా.. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.