/rtv/media/media_files/2024/10/29/scyviHkHL8b2AIzqzEJw.jpg)
నందమూరి నటసింహం బాలయ్య వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టారు. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'NBK 109'. మెగాస్టార్ కు 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ మూవీ అంచనాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళికి ఆ ఎదురుచూపులకు తెరపడనుంది. ఆ రోజు మూవీ టైటిల్ తో పాటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.
Get ready to meet the GOD OF MASSES #NandamuriBalakrishna in his most stylish action avatar yet this Sankranti 2025💥🤙#NBK109 Title Teaser will be out this Diwali❤️🔥 pic.twitter.com/Bl0eopg0tv
— KLAPBOARD (@klapboardpost) October 29, 2024
Also Read : 'జై హనుమాన్' సర్ప్రైజింగ్ అప్డేట్.. హనుమంతుడిగా కనిపించేది ఎవరంటే?
టైటిల్ అదిరింది..
అయితే టైటిల్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. కథకు సూట్ అయ్యేలా ఈ సినిమాకు 'సర్కార్ సీతారాం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. అక్టోబర్ 30న టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు ఫిలిం సర్కిల్స్ టాక్ వినిపిస్తుంది.
#NBK109
— 🚲🇻🇪🇳🇰🇦🇹 𝒦𝓊𝒸𝒽𝒾𝓅𝓊𝒹𝒾 🚲 (@VenkatKuchipud4) October 28, 2024
చిత్రం పేరు *సర్కార్ సీతారామ్* గా దాదాపు ఖరారు....😎
ఈనెల 30 సాయంత్రం టైటిల్ టీజర్ రిలీజ్ ప్రకటన చేసే అవకాశం
మొదట డాకూమహరాజ్ అని అనుకున్నా చివరకు సర్కార్ సీతారామ్ టైటిల్ కే మొగ్గు చూపిన చిత్రబృందం pic.twitter.com/AzziGV67nz
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా, తెలుగమ్మాయి చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : చిరంజీవి Vs మోహన్ బాబు.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్