AP News: ఏపీలోని డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఓ యువతి ప్రేమించిన ప్రియుడికోసం మౌన పోరాటానికి దిగింది. నాగరాజు అనే యువకుడు కొంతకాలంగా తనను ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా అనుభవించి మోసం చేశాడని వాపోయింది. ఈ మేరకు కాట్రేనికోన మండల తహశీల్దారు కార్యాలయం ఎదుట దళిత యువతి రిలే నిరాహార దీక్ష చేపట్టింది. అతనికి మండలానికి చెందిన ప్రముఖ సీనియర్ విలేఖరి వత్తాసు పలికినట్లు బాధితురాలు తెలిపింది. ప్రేమించి పరారైన నాగరాజు, ప్రముఖ విలేఖరి అండతో దాగుడుమూతలాడుతున్నాడని ఆరోపించింది. తనను కులంపేరుతో దూషించి, నీ జాతికి ఇది మామూలే కదా, ఈరోజు ఒకడితో, రేపు మరొకడితో అంటూ ప్రముఖ సీనియర్ విలేఖరి హేళన చేసాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రియుడితో వివాహం జరపాలని, ప్రముఖ సీనియర్ విలేఖరిపై అత్యాచార నిరోధక, వేధింపుల చట్టం (sc,st atrocity) ప్రకారం కేసు నమోదుచేయాలని యువతి డిమాండ్ చేస్తోంది.