Dogs Attack On 4 Days Baby : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి (Warangal MGM Hospital) లో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసిగుడ్డును కుక్కలు (Dogs Attack) పీక్కుతిన్నాయి. జనం రద్దీగా తిరిగే ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డు ముందే ఈ ఘటన జరగడం దారుణం. అయితే కుక్కలు ఆ చిన్నారి మృతదేహన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాయి అనేది మాత్రం తెలియరాలేదు. పోలీసులు ఆసుపత్రి అధికారులు ఈ దారుణ ఘటన గురించి వివరాలు సేకరిస్తున్నారు.
ఆ పసికందు ఆడనా, మగనా? అనేది తెలియాల్సి ఉంది. సగం బాడీని కుక్కలు తినేయడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పసికందు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వారి చిన్నారి కాకపోవచ్చునని భావిస్తున్నారు. డెడ్ బాడీని తీసుకువచ్చి ఎంజీఎం పరిసరాల్లో వదిలివేసినట్లు అనుమానిస్తున్నారు.