Maa Nanna Superhero: సుధీర్ బాబు (Sudheer Babu) అప్ కమింగ్ ప్రాజెక్టులు చెప్పగానే ఎవరికైనా మామా మశ్చీంద్ర మూవీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ సుధీర్ బాబు చేతిలో ఇది మాత్రమే కాదు, ఇంకో సినిమా కూడా ఉంది. దాన్ని సైలెంట్‌గా పూర్తిచేశాడు ఈ హీరో. దీనికి ఓ కారణం కూడా ఉంది. ముందుగా సినిమా డీటెయిల్స్ చెక్ చేద్దాం.
సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర (లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ ) దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. వి-సెల్యులాయిడ్స్ బ్యానర్ (V Celluloids)పై
సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా నాన్న సూపర్ హీరో’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ బాబు వెల్లడించాడు. యూనిట్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టాడు.
Also Read: అష్టా చమ్మా నుంచి దసరా వరకు.. 15 ఏళ్ల నాని
ప్రస్తుతం ‘మా నాన్న సూపర్ హీరో’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫాదర్స్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ క్లిక్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్గా నటిస్తోంది. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం మామా మశ్చీంద్ర సినిమాపై ఫోకస్ పెట్టాడు సుధీర్ బాబు. హర్షవర్థన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. లక్కీగా దసరా హాలిడేస్ సీజన్ కలిసొచ్చింది. ఇలాంటి టైమ్‌లో ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమాను హైలెట్ చేస్తే, మామా మశ్చీంద్రకు మైలేజీ తగ్గుతుందనేది సుధీర్ బాబు భయం. అందుకే ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా విషయంలో లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. మామా మశ్చీంద్ర థియేటర్లలోకి వచ్చిన వెంటనే ‘మా నాన్న సూపర్ హీరో’ ప్రచారం భారీ ఎత్తున స్టార్ట్ అవుతుంది.
Also Read: రామ్ చరణ్‌కు ఇష్టమైన వంటకం ఇదే!