ప్రభాస్ కు జోడిగా నయనతార.. 17 ఏళ్ళ తర్వాత క్రేజీ కాంబో రిపీట్
'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి వంగా.. నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేశారట. ఇప్పటికే స్క్రిప్ట్ ని నయనతారకు వినిపించాడట. స్క్రిప్ట్ నచ్చి నయన్ కూడా ప్రభాస్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా గతంలో ఈ ఇద్దరు 'యోగి' సినిమాలో నటించారు.