Kushi Movie Trailer : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఖుషి మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది .రెండు నిమిషాల 41 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది . విజయ్ దేవరకొండ ,సమంత జంటగా ,శివానిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.తెలుగుతో పాటు తమిళ్,మలయాళం ,కన్నడ , హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీపై విజయ్ ,సమంత భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రీలీజైన గ్లిమ్ప్స్ , ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్ లో విజయ్ దేవరకొండ , సమంత మధ్య కెమిస్ట్రీ క్యూట్ గా కనిపించడంతో పాటు అబ్దుల్ వహాబ్ సంగీతానికి పాజిటివ్ టాక్ వస్తుంది.
Watch Kushi Movie Trailer Here
Also Read: భోళా శంకర్ రిలీజ్ కు పెద్ద చిక్కు వచ్చి పడిందే..కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్!