Telangana MP’s Resigned: తెలంగాణలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వంకొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలందరూ తమ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ ఢిల్లీకి వెళ్లి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ALSO READ: పార్లమెంట్ లో దాడి.. లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం!
తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఉత్తమ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసినదే. ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉత్తమ్ తన లోక్‌సభ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను పార్లమెంటులో స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా..
మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీకి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.
ALSO READ: BREAKING: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.
శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు చేసి, 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నుండి ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన సందర్భంగా.. మెదక్ పార్లమెంటు సభ్యుడిగా లోక్ సభ స్పీకర్ ఓం… pic.twitter.com/rvFOow9FYG
— Kotha Prabhakar Reddy (@KPRTRS) December 13, 2023