TDP Kolikapudi Srinivas: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వివాదస్పద వ్యాఖ్యాలు చేశారు. వైశ్య వర్గాలను ఆకాశానికి ఎత్తి ఉద్యోగులు, రైతు వర్గాల శ్రమను కించ పరిచే విధంగా కామెంట్స్ చేశారు. సూర్యుడు ఉదయించక ముందే లేచేది – అర్ద రాత్రి వరకు పని చేసేది ఆర్య వైశ్య కులస్తులని.. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయ దారులు కూడా అంతలా పనిచేయరని అన్నారు.
అవహేళన..
స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి దళితులు, బడుగు, బలహీన వర్గాలకు.. అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అందచేసినా వారు అభివృద్ధి చెందక పోవటానికి కారణం చెడు అలవాట్లకు బానిసలు కావటమేనన్నారు. కష్టం పెట్టుబడిగా, క్రమశిక్షణ ఆస్తిగా సంపాదించిన రూపాయిని కాపాడి.. పది రూపాయలు చేసే జాతి వైశ్య జాతి అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీ రాములు వచ్చే జయంతి నాటికి 18 అడుగుల విగ్రహంను పెట్టి తిరువూరు చీరాల సెంటర్ ను పొట్టి శ్రీ రాములు సెంటర్ గా మారుస్తానని అన్నారు. మీకు ఏ పధకాలు వుండవు, మీరు లేకపోతే పధకాలే వుండవు అంటూ వైశ్య జాతిని కీర్తిస్తూ, అట్టడుగు వర్గాలను అవహేళన చేసినట్లు తెలుస్తోంది.
Also Read: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ!
ఎట్టి పరిస్థితుల్లో..
నరేంద్ర మోడీ ఈ దేశాన్ని నడపాలన్నా, జగన్ రెడ్డి బటన్ నొక్కాలన్నా ఆర్య వైశ్య కులస్తులు చెల్లించే పన్నులే కారణమని వ్యాఖ్యానించారు. మోడీ వసూలు చేసే లక్షల కోట్లు జిఎస్టీ పన్నులు వైశ్య వ్యాపార వర్గాలు చెల్లించేవేనని కామెంట్స్ చేశారు. తానొక టీచర్ నని.. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించనని, ఉన్నత పదవుల్లో వున్న తన దగ్గరి బంధువులు ముగ్గురిని అవినీతిపై ఏసీబీకి పట్టిచ్చిన చరిత్ర తనదని చెప్పుకొచ్చారు.
త్రాగుబోతు.. బందిపోటు
తప్పు చేస్తే తెలుగుదేశం వారి నైనా ప్రశ్నిస్తానన్నారు. తిరువూరు వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ త్రాగుబోతు అయితే ఆయన సతీమణి సుధారాణి బందిపోటు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోవు ఎన్నికల్లో తన ప్రత్యర్థి స్వామిదాస్ అయితే ఆయన అవినీతిని ప్రశ్నించే నాయకుడు కొలికపూడి అని అన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే రెండో సారి ఇంట్లో ఉండి 90శాతం ఓట్లతో గెలిచి చూపిస్తానని..అంతలా నియోజకవర్గంను అభివృద్ధి చేస్తానని వ్యాఖ్యానించారు.