Kannppa Teaser Out : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్స్కేల్ లో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. సౌత్, నార్త్ కి చెందిన టాప్ సెలెబ్రిటీస్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ నెలకొంది. దాన్ని రెట్టింపు చేసేందుకు మంచు విష్ణు నిత్యం ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూనే ఉంటాడు. జూన్ 14న టీజర్ రిలీజ్ అంటూ పోస్టర్ ద్వారా తెలిపాడు. ఇక చెప్పినట్లుగానే నేడు టీజర్ ని రిలీజ్ చేశారు.
విజువల్ వండర్ గా…
తాజాగా రిలీజైన ఈ టీజర్ సూపర్బ్ విజువల్స్ తో చాలా గ్రాండియర్ గా ఉంది. టీజర్ లో
కథ రివీల్ చేయకుండా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగింది. తాజాగా చూపించిన టీజర్ ప్రకారం అక్షయ్ కుమార్ శివుడిగా నటించినట్టు తెలుస్తుంది. అలాగే టీజర్ లో ప్రభాస్ కళ్ళని చూపిస్తూ ఓ షాట్ వేశారు. ప్రభాస్ కళ్ళు మాత్రమే కనిపించేలా చేసి ఆయన చేస్తున్న పాత్రపై సస్పెన్స్ ను కొనసాగించారు.
Also Read : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి భారీ షాక్.. ఇక నుంచి నో మూవీస్, ఓన్లీ పాలిటిక్స్!
ఇక టీజర్ లో విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కన్నప్పని వీరుడిగా చూపిస్తు వచ్చే సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్న యాక్టర్స్ ఈ టీజర్ లో తళుక్కున మెరిశారు. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని సాధించేలా కనిపిస్తోంది. ఇక కన్నప్పని ఓ వీరుడిగా చూపిస్తూ యుద్ధ సన్నివేశాలతో కట్ చేసిన టీజర్ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేసింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు.
Here’s presenting the ‘𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚’ teaser! After years of dedication and hard work, this story has come to life. I’m thrilled to share it with you and can’t wait for you to experience this epic actioner!#Kannappa🏹 #KannappaTeaser #HarHarMahadevॐ
Telugu▶️… pic.twitter.com/6HI5iJmMts
— Vishnu Manchu (@iVishnuManchu) June 14, 2024