Kanguva Movie First Single On July 23 : తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ పీరియాడికల్ డ్రామా మూవీ ‘కంగువ’ ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఖరారైంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను జులై 23 సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. తాజగా మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఫస్ట్ సింగిల్ ‘ఫైర్’ అనే పేరుతో సాగనున్నట్లు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్.. సాంగ్ పై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
Fire song on 23rd July 🔥🔥#KanguvaFirstSingle #Kanguva pic.twitter.com/Bh5qVbK95r
— P E A C E ✌ (@Cult_tweets0) July 18, 2024
#Kanguva – #FireSong – Expecting a Banger of a Song from #DSP ..⭐#Suriya | #SiruthaiSiva | #BobbyDeol pic.twitter.com/POlsvMLK14
— Laxmi Kanth (@iammoviebuff007) July 18, 2024
Also Read : అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవలు.. RTV వద్ద ఎక్స్క్లూజివ్ సమాచారం!
ఈ పోస్టర్ లో సూర్య బీస్ట్ మోడ్ లో కనిపించాడు. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని మూవీ టీమ్ చెబుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రానున్న ‘కంగువ’ పార్టు 1 అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ సుమారు 38 భాషల్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.