Medigadda Project: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన.. అసాంఘిక శక్తుల ప్రమేయంపై అనుమానం..!
గోదావరి నదిపై మహదేవ్ పూర్ వద్ద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అర్థరాత్రి సమయంలో భారీ శబ్దంతో బి-బ్లాకులోని బ్యారేజీ 20వ పిల్లర్ కుంగింది. దాంతో బ్రిడ్జ్ స్వల్పంగా కుంగింది. ఈ ఊహించని పరిణామంతో అలర్ట్ అయ్యారు అధికారులు. డ్యామ్ పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో.. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఈ ఘటన వెనుక అసాంఘిక శక్తులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. సిరోంచ, మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.