Quotation Gang: బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కొటేషన్ గ్యాంగ్ (QG)’ నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ భయంకరమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ కు భారీ స్పందన లభించగా.. తాజాగా నెత్తుటి మరకలతో కనిపించే నటీనటుల లుక్స్ తో కూడిన పోస్టర్ విడుదల చేయగా ఇది సినిమాపై మరింత క్యూరియాసిటి పెంచేస్తోంది.
View this post on Instagram
ఈ మేరకు ‘కొటేషన్ గ్యాంగ్’ 2024 ఆగస్టు 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ‘‘కొటేషన్ గ్యాంగ్’ ఆగస్టు 30న విడుదలకానుంది. మీ అందరినుంచి విశేషమైన మద్ధతు లభిస్తున్నందుకు ధన్యవాదాలు. ది గ్రేట్ సపోర్ట్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు మేకర్స్. ఇక ఈ మూవీని ఫిల్మినాటి ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత గాయత్రి సురేష్ నిర్మించగా.. డ్రమ్స్ శివమణి ఒళ్లు గగుర్లుపొడిచే సంగీతం అందించారు.