Rajamouli Updates About Next Movie With Mahesh: SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో రాజమౌళి, మహేష్ బాబు కలిపి ఒక సినిమా చేయనున్నారు. ఈసినిమా గురించి ప్రకటించి చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు షూటింగ్ మొదలుపెట్టలేదు. అయితే తాజాగా జపాన్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కి హాజరయిన రాజమౌళి.. తన రాబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహేష్‌తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని…త్వరలోనే సెట్స్ మీదకు వెళతామని చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి మూవీ మహేష్ బాబును ఒక్కరినే సెలెక్ట్ చేశామని..మిగతా కాస్టింగ్‌ను సెలెక్ట్ చేయాలని చెప్పారు.
మంచి అందగాడు..
పనిలో పనిగా మహేష్‌బాబును తెగ పొగిడేశారు రాజమౌళి. మమేష్ మంచి అందగాడని…అతన్ని జపాన్ వాసులకు చూపిస్తానని అన్నారు రాజమౌళి. మీలో చాలా మందికి అతను తెలిసే ఉంటాడని..వీలైనంత తొందరగా మహేష్‌తో సినిమా పూర్తి చేసి..రిలీజ్ టైమ్‌లో ఇక్కడకు తీసుకువచ్చి పరిచయం చేస్తానని మాటిచ్చారు దర్శకధీరుడు. రాజమౌళి మహేష్‌బాబుతో చేస్తున్న సినిమాకు ఆయన తండ్రి విజేంద్రప్రసాద్ కథ అందించారు. ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని, వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడని ఇప్పటికే రైటర్ విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. రాజమౌళి కామెంట్స్‌కు మహేష్‌బాబు ఫ్యాన్ ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. SSMB 29 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు.
“We completed the writing & it is in the pre-production process. The only hero is locked, his name is @urstrulyMahesh .
He is very handsome. Hopefully we finish the film a little bit fast & during the release I will bring him here.”
– @ssrajamouli in Japan #SSMB29 #Rajamouli pic.twitter.com/mcFSp8iXcO
— Rajesh Manne (@rajeshmanne1) March 19, 2024
ఇక జపాన్‌లో రాజమౌళికి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. జపనీయులు ఆయన ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా రాజమౌళికి ఓ 83ఏళ్ళ మహిళ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. దీన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి సంబరపడిపోయారు.
In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹
Some gestures can never be repaid.
Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw— rajamouli ss (@ssrajamouli) March 18, 2024