Jabardasth Comedian Avinash Interview : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ (Jabardasth) ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ముక్కు అవినాష్ (Avinash) కూడా ఒకడు. మొదట కంటెస్టెంట్ గా చేరి తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. టీమ్ లీడర్ గా దూసుకుపోతున్న సమయంలోనే బిగ్ బాస్ అఫర్ వచ్చింది. దాంతో జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ (Bigg Boss) హౌజ్ లోకి అడుగుపెట్టాడు. హౌజ్ లోనూ తోటి కంటెస్టెంట్స్ ను నవ్వించి, తన ఆట తీరుతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అయితే బిగ్ బాస్ కి వెళ్లే ముందు అవినాష్ ఏకంగా 10 లక్షలు ఫైన్ కట్టాడట. ఈ విషయాన్ని అతనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
10 లక్షలు ఫైన్…
జబర్దస్త్ లో, ఆ షో నిర్మాణ సంస్థలో చేసేవారికి అక్కడ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ తో పాటు ఇన్నాళ్లు చేయాలని బాండ్ కూడా ఉంటుంది. ఆ బాండ్ మధ్యలో బ్రేక్ చేసి వెళ్తే ఆ నిర్మాణ సంస్థకి భారీగా ఫైన్ కట్టాల్సిందే. అయితే అవినాష్ జబర్దస్త్ చేస్తున్నప్పుడే బిగ్ బాస్ అవకాశం రావడంతో ఆ బాండ్ బ్రేక్ చేసి బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇందుకు జబర్దస్త్ నిర్మాణ సంస్థకు అవినాష్ 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also Read : ‘డబుల్ ఇస్మార్ట్’ కౌంట్ డౌన్ షురూ.. నెక్స్ట్ లెవెల్ లో టైటిల్ సాంగ్ షూటింగ్!
శ్రీముఖి దగ్గర అప్పు చేసి…
అయితే ఆ సమయంలో అతని దగ్గర అంత డబ్బు లేకపోవడంతో యాంకర్ శ్రీముఖి (Sreemukhi) దగ్గర 5 లక్షలు, మరొకరి దగ్గర 5 లక్షలు తీసుకొని ఆ ఫైన్ కట్టినట్టు తెలిపాడు. బిగ్ బాస్ వల్ల తనకు ఫైనాన్షియల్ గా బాగానే డబ్బులు వచ్చాయని, ఆ తర్వాత కూడా టీవీ, సినిమాల్లో మంచి ఛాన్సులు వచ్చాయని అవినాష్ తెలిపాడు. ఇక శ్రీముఖి తనకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అని, ఆ స్నేహంతోనే తనకు అప్పు ఇచ్చిందని పేర్కొన్నాడు. దీంతో అవినాష్ చేసిన ఏ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.