Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్ 2024 బరిలో దిగబోతున్న భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకూ జరగనున్న ఈ ఐసీసీ టోర్నీ జరగనుండగా 15 మంది సభ్యులతో కూడిన ఫైనల్ టీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ మేరకు కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur), వైస్ కెప్టెన్ గా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వ్యవహరించనున్నారు.
🚨 NEWS 🚨
Presenting #TeamIndia‘s squad for the ICC Women’s T20 World Cup 2024 🙌 #T20WorldCup pic.twitter.com/KetQXVsVLX
— BCCI Women (@BCCIWomen) August 27, 2024
భారత మహిళ జట్టు:
హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పుజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, హేమలత, ఆశా శోభన.
అలాగే.. వికెట్‌కీపర్ యాస్తికా భాటియా, ఆల్‌రౌండర్ శ్రేయంకా పాటిల్, సంజనా సంజీవన్ ఫిట్నెస్ సాధిస్తే జట్టుతోపాటు వెళ్తారు. సైమా ఠాకూర్, ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికయ్యారు.
View this post on Instagram
ఈ మెగా టోర్నీలో మొత్తం 10 పాల్గొననుండగా రెండు గ్రూప్‌లుగా డివైడ్ చేశారు. గ్రూప్‌లోని ప్రతి టీమ్ ప్రతి జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ పోరులో నిలుస్తాయి.
గ్రూప్ ఏ:
భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక
గ్రూప్ బి:
సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్
ఇక ఇండియా టీమ్ అక్టోబర్ 4న న్యూజిలాండ్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరగనుంది. అక్టోబర్ 17, 18న సెమీ ఫైనల్స్, అక్టోబర్ 20న ఫైనల్ జరగనుండగా ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఛాన్స్ ఉంది.