Actress Ranu Desai : ప్రముఖ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఆమె పెట్టే పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ యానిమల్ లవర్ అనే విషయం అందరికీ తెలుసు. మూగ జీవాలను హింసిస్తే ఆమె అస్సలు ఊరుకోదు.
సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. తాజాగా ఇదే జరిగింది. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో రీసెంట్ గా వచ్చిన ‘ఇండియన్-2’ సినిమాలోని కొన్ని డైలాగ్స్ పెట్ లవర్స్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రేణు దేశాయ్ స్పందిస్తూ ఇన్ స్టాలో సంచలన పోస్ట్ పెట్టింది.
Also Read : నందమూరి వారసుడి డెడికేషన్.. 5 నెలల్లోనే అన్ని కేజీల బరువు తగ్గిన మోక్షజ్ఞ
ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసిన ఆమె..’ ఇండియన్ సినిమా ఫ్లాప్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది డిజాస్టర్ కావాల్సిన మూవీనే. అసలు ఈ ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తున్నారు ఇలాంటి డైలాగ్స్. అసలు వాళ్ళకి ఏమైంది’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా చేతులు జోడించి దండం పెట్టిన ఎమోజీని షేర్ చేసింది. దీంతో రేణు దేశాయ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.