ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దాయాదుల పోరు ప్రాంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం ఎప్పుడు పడేది తేలియడం లేదు. కానీ ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డం పడవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.
మరోవైపు దాయాదుల మధ్య జరుగుతున్న సమరంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ నిదానంగా ఆడుతున్నారు. పాక్ బౌలింగ్‌ను సమర్దవంతంగా ఎదుర్కొంటూ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా 8 ఓవర్లు పూర్తయ్యేలోపు50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ (10) శుభ్ మన్‌గిల్ (39) పరుగులుతో క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లలో భారత ఓపెనర్లు 50 పరుగులే పూర్తి చేయవడంతో భారత్ బ్యాటింగ్ ఎలా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు.
మరోవైపు సెప్టెంబర్ 2 టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడింది. దాయాదుల మధ్య జరిగిన పోరులో టాప్ ఆర్డర్ విఫలమైనా మిడిలార్డ్ రాణించడంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ అయిపోగానే భారీ వర్షం మొదలైంది. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.