Ileana D’Cruz: ఇలియానా ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. వైవీయస్ చౌదరి దర్శకత్వంలో ‘దేవదాస్’ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ. ఆ తర్వాత పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. రాఖీ, మున్నా, జల్సా, కిక్, జులాయి ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇలియానా హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ‘దేవదాసు’ బాక్స్ ఆఫీస్ మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు బెస్ట్ డెబ్యూ నటిగా ఫిలిం ఫెయిర్ అవార్డు సొంతం చేసుకుంది. తెలుగులో వరుస విజయాలతో దూకెళ్లిన ఈ బ్యూటీ.. హిందీ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ‘బర్ఫీ’ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి .. ఆ తర్వాత ‘మై తేరా హీరో’, ‘హ్యాపీ ఎండింగ్’ ‘రుస్తుం’,‘బాద్షాహో’ ‘రైడ్’, ‘ముబారకన్’ ఇలా పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ లభించలేదు.
తెలుగు, హిందీ మాత్రమే కాదు తమిళ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలో ‘Kedi’, ‘Nanban’ సినిమాల్లో నటించింది. చివరిగా తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కనిపించింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో.. ఎలాంటి అవకాశాలు రాలేదు. సినిమాలకు దూరమైనా ఇలియానా.. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Varun-Lavanya Marriage: కొడుకు పెళ్ళికి దూరంగా పవన్ కళ్యాణ్..!