మధ్యతరగతివారి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు బీజేఈపీ ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మధ్యంతర బడ్జెట్లో భాగంగా ఇంటి నిర్మాణం, కొనుగోలుకు ప్రభుత్వం మద్దుతు ఇస్తుందని చెప్పారు. బస్తీలు, ఆద్దె ఇళ్ళల్లో ఉన్నవారి పొంత ఇంటికలను నెరవేరుస్తామని అన్నారు. ఆవాస్ యోజనా కింద మరో 2కోట్ల ఇళ్ళు నిర్మిస్తామని తెలిపారు. దీంతో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. అలాగే ఆశా వర్కర్లందరికీ, అంగన్వాడీ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందని హామీ ఇచ్చారు. దాంతో పాటూ మౌలిక వసతుల రంగానికి 11.11లక్షల కోట్లు బడ్జెట్‌ను కేటాయించామని చెప్పారు. పాడి అబివృద్ధి రేతులకు గవర్నమెంటు సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
houses
congress government:పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు?
తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించిన దగ్గర నుంచీ వరుసపెట్టి ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే కాక ఇళ్ళ కేటాయింపు, రైతు బంధు పంపిణీ లాంటి విషయాల మీద కూడా ఫోకస్ పెట్టింది. వీటి మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటూ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇళ్ళ నిర్మాణానికి 3, 4 నమూనాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గృహ నిర్మాణ సంస్థ పునరుద్ధరణ చేయాలని చెప్పారు. ప్రస్తుతం గృహనిర్మాణ శాఖ..రోడ్లు, భవనాల శాఖలో భాగంగా ఉంది. దీన్ని వేరేగా ఒక శాఖ చేయాలా అన్న దాని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దీని కోసం ఇతర శాఖల నుంచి సిబ్బందిని తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లపై త్వరలోనే సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారని సీఎం కార్యాలయం చెప్పింది. సీఎం సమీక్ష తర్వాత ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.
Also Read:పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ ఓనర్
మరోవైపు తెలంగాణలో రైతుబంధు పంపిణీ కొనసాగుతోంది. సోమవారం నుంచి నిధుల జమ మొదలైంది. మొదటగా ఎకరాలోపు భూమున్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేస్తున్నారు. ఇప్పటిదాకా 22లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.640కోట్ల జమ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈసారికి పాత పద్ధతిలోనే రైతుబంధును జమ చేస్తున్నామని తెలిపింది. ఒకటిరెండు రోజుల్లో రైతుబంధుపై సర్క్యులర్ విడుదల చేస్తామని చెప్పింది. అది వచ్చాక కొత్తవారికి స్కీం వర్తింపు ఉంటుందని వివరించింది.
ఇక ధరణి పోర్టల్‌పై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసే ఆలోచనలో ఉందని సమాచారం. ధరణిలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అందుకే దాని స్థానంలో కొత్త పోర్టల్ తెస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని తెలిపింది.
Hyderabad Real Estate: హైదరాబాద్ లోని ఆ ఏరియాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. !
ప్రస్తుతం దేశంలో టాప్ నగరాల్లో ఇళ్ల ధరలు, అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ ధరలు 13 నుంచి 33 శాతం వరకు పెరిగాయని తెలుస్తోంది. అన్ని టాప్ సిటీలతో పోల్చుకుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే ఎక్కువగా పెరిగినట్లు సమాచారం.
అందులో కూడా గచ్చిబౌలి ఏరియాలో ఇళ్ల రేట్లు మరింతగా పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి గచ్చిబౌలిలో చదరపు అడుగు సగటు ధర రూ. 6,355 గా నమోదు అయ్యింది. మూడేళ్ల క్రితం ఇదే నెలలో రూ. 4,790 గా ఉంది. ఇలా ఉంటే కొండాపూర్ లో చదరపు అడుగు రూ. 6,090 గా ఉంది.
కేవలం హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ఏరియాలో ఇళ్ల రేట్లు గడిచిన మూడు సంవత్సరాలలో భారీగా పెరిగాయి. డిమాండ్ కు తగినట్లుగానే అడుగు ధర రూ.6,325 కి పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాపర్టీల రేట్లు పెరుగుతునే ఉన్నాయి. నిర్మాణ ఖర్చులు పెరగడంతో పాటు ముడి సరుకుల ధరలు కూడా ఎక్కువవ్వడం, ల్యాండ్ ధరలు పెరగడంతో పాటు డిమాండ్ కొనసాగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఇళ్లు కొనాలనేకునే వారు పెద్ద ఇళ్లకు ఎక్కువ మక్కువ చూపుతున్నారని తెలుస్తుంది. అన్ని సౌకర్యాలు ఉండే ఇళ్లనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అందుకే రేట్లు పెరుగుతున్నాయని తెలిపారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ – ఎన్సీఆర్ లో ఇళ్ల ధరలు గత మూడేళ్లలో 27 శాతం వరకు పెరిగాయి.
మరోపక్క రియల్ ఎస్టేట్ సెక్టార్ దూసుకుపోతుంది. ఈ ఏడాది నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 62 శాతం పెరిగింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును తాత్కాలికంగా ఆపడం, డిమాండ్ కొనసాగుతుండడం వంటి కారణాలతో రియల్టీ షేర్లు విపరీతంగా పెరిగాయి. దీంతో కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో బుకింగ్స్ అందుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లు అందుబాటులోకి వస్తుండడంతో సేల్స్ పెరుగుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. మరిన్ని కొత్త లాంచ్‌లు ఉండడంతో రియల్టీ కంపెనీల షేర్లు ఇంకా పెరుగుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
Also read: వైజాగ్‌లో బెస్ట్ లవర్స్ స్పాట్స్ ఇవే 🥰.. ప్రేమ లోతులు బయటపడే ప్రదేశాలు!
Rajasingh: వారికి మాత్రమే ఇళ్లు ఇవ్వాలి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు సిద్ధమవుతున్నారన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో మొదటి విడతలో ఐదు వందల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించారన్న ఆయన.. అనంతరం రెండో విడతలో మరో వంద మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇచ్చారన్నారు. కాగా ప్రస్తుతం మూడో విడతలో 1500 మందికి ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారని రాజాసింగ్ విమర్శించారు.
గతంలో దూల్ పేటలో నివసించే పేదలు గుడుంబా అమ్ముకొని జీవనం సాగిస్తుండేవారని గోషామహల్ ఎమ్మెల్యే గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ గుడుంబాను పూర్తిగా నిషేధించడంతో పేదవారు ఉపాధి కోల్పోయ్యారన్నారు. అంతే కాకుండా వారిపై పీడీ యాక్ట్, గుండా యాక్ట్‌లు పెట్టి గుండుంబాను బంద్ చేయించారన్న ఆయన.. ఇప్పటి వరకు వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించలేదన్నారు. దూల్‌పేట ప్రజలకు రియాబిలిటేషన్ చూపిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారని రాజాసింగ్ గుర్తు చేశారు.
తాను సైతం అనేకసార్లు ఇదే విషయంపై అసెంబ్లీలో ప్రస్తావించానని రాజాసింగ్ గుర్తు చేశారు. దూల్‌పేట వచ్చి అక్కడి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 1500 ఇళ్లలో గుడుంబా వృత్తిని మానేసిన వారిని గుర్తించి వారికి రియాబిలిటేషన్ కింద ఇండ్లు ప్రకటించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అర్హులైన వారికి కాకుండా వేరే వారికి ఇళ్లు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలన్న ఆయన.. బీఆర్ఎస్ నేతలు వారి కార్యకర్తలకు ఇళ్లు ఇస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఇదేం టోర్నడో రా బాబూ…ఇళ్ళు, వాహనాలు కూడా ఎగిరిపోయాయి
డ్రాగన్ కంట్రీ చైనాలో ఓ టోర్నడో అల్లకల్లోలం చేసింది. దీని దెబ్బకు దాదాపు పది మంది మృత్యువాతను పడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయాలపాలయ్యారు. చైనాలోని జియాంగ్స్ ప్రవాన్స్ లోని సుకియాన్ పట్టణంలో మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద టోర్నడో విరుచకుపడింది. వాతావరణం ముందు మెల్లగా మారి తర్వాత సుడిగాలిగా రూపాంతరం చెందింది. క్షణాల్లోనే అది టోర్నడోగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారిగా మొత్తం సుకియాన్ పట్టణాన్ని మొత్తం చుట్టేసింది. పెద్ద శబ్దంతో, విపరీతమేన గాలితో ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఈ గాలి వేగానికి ఇళ్ళు, చెట్లు, వాహనాలు సైతం గాల్లోకి ఎగిరిపోయాయి. కళ్ళముందే అంతా జరిగిపోయింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Horrific tornado in Suqian, Jiangsu Province of China kills 10, hundreds relocated pic.twitter.com/xarV3ywJip
— maria larsson (@marialarsson201) September 20, 2023
సుడిగాలి తీవ్రతకు సుకియాన్ ఏకంగా 137 ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. చనిపోయిన వారి సంఖ్య పదే ఉన్నా టోర్నడో వల్ల ప్రభావితమైన వారు మాత్రం దాదాపు 5,500 మంది ఉన్నారు. సుమారు 400 మంది తమ ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళాల్సి వచ్చింది. వాహనాలు అయితే చెల్లాచెదురు అయిపోయాయి. ఎవరి వాహనం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. చాలా ఆస్తి నష్టం జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. టోర్నడో దెబ్బకు కరెంట్ తీగలకు మంటలు అంటుకున్నాయి. పైకెగిరిన ఇళ్ళ శకలాలు మీద పడడ్తో కొందరికి తీవ్ర గాయాలు అయితే మరికొందరు అక్కడిక్కడే మృతి చెందారు.
Deadliest tornado strike in #China in 2 years.
Atleast 4 tornadoes hit Suqian and Yancheng in #Jiangsu province. Death toll reported to be 10 so farVC: @Ericwang1101#tornado #storm #weather #climate #viral #Suqian #Yancheng pic.twitter.com/CrIYhMWGOo
— Earth42morrow (@Earth42morrow) September 20, 2023
చైనాలో టోర్సడో భీభత్సం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. బాబోయ్ ఇలాంటి భయంకరమైనది ఎప్పుడూ చూడలేదు అంటూ గుండెల మీద చేతులు వేసుకుంటున్నారు వీడియో చూసినవాళ్ళు.
#SevereWeather 📹
Schockierender Tornado 🌪️ verursacht Chaos in der Stadt #Suqian, China.Ein beeindruckender Tornado hat in den letzten Stunden in der Provinz Jiangsu Verwüstungen angerichtet, bei denen mehrere Menschen verletzt und getötet wurden. pic.twitter.com/9v8N0ibNXf
— Meteored | daswetter (@MeteoredDE) September 20, 2023
ఆగని హింస బస్సులకు, ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు!
మణిపూర్ లో దుండగలు మరోసారి రెచ్చిపోయారు. మణిపూర్ లో చెలరేగిన మంటలు ఇప్పుడప్పుడే ఆరే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మోరే జిల్లాలో దుండగులు ఎన్నో ఇళ్లకు నిప్పు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని బస్సులను కూడా తగలబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
పోలీసు సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే బస్సులకు నిందితులు నిప్పు పెట్టినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా మూడు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవలే అక్కడ ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతో దేశం అట్టుడుకింది.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కూడా విపక్షాలు ఈ అంశం గురించి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఈ అంశాల గురించి ప్రస్తావిస్తూ సీఎం బీరెన్ నేను రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదని గట్టిగా చెప్పారు.
‘నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే ప్రశ్నే లేదు. కానీ, కేంద్ర నాయకత్వం, మణిపూర్ ప్రజలు కోరుకుంటే నేను పదవిని వదిలేస్తాను’ అని ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతేకాకుండా నేను ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడిని. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. కేంద్ర నాయకత్వం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను.మణిపూర్ లో వీలైనంత త్వరగా శాంతి భద్రతలు, శాంతిని పునరుద్ధరించడమే ప్రస్తుతం నా ముందు ఉన్న ప్రధాన లక్ష్యం.