Anant Ambani-Radhika Pre Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈవో వీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ కు దేశ విదేశాల నుంచి అతిథులు హాజరవుతున్నారు. ప్రముఖుల రాకతో గుజరాత్ లోని (Gujarat) జామ్ నగర్ లో సందడి వాతావరణం నెలకొంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు సినీతారలు, పలువురు ప్రముఖలు జామ్ నగర్ కు (Jamnagar) తరలివచ్చారు. వీరిని ఆహ్వనించేందుకు ఎయిర్ పోర్ట్ లో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టులో అతిథిల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ కపుల్ అక్కడ సందడి చేస్తున్నారు. రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకునే, రాణిముఖర్జీ, షారుఖ్ ఫ్యామిలీ (Shah Rukh Khan), అర్జున్ కపూర్, అలియాభట్, రణబీర్, దర్శకుడు అట్లీ జామ్ నగర్ చేరుకున్నారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ (Anant Ambani-Radhika Pre Wedding) ఫంక్షన్ కోసం హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా జామ్‌నగర్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు, జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సల్మాన్ ఖాన్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, అభిషేక్ బచ్చన్, హాలీవుడ్ నుండి అమెరికన్ సింగర్ జే బ్రౌన్, ఆడమ్ బ్లాక్‌స్టోన్‌తో సహా చాలా మంది ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొనడానికి చేరుకున్నారు.
View this post on Instagram
బాలీవుడ్ కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ కూడా తన భార్య, కొడుకు ఆర్యన్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, చిన్న కొడుకుతో జామ్‌నగర్ చేరుకున్నారు. విమానాశ్రయం అనంతరం ఖాన్ కుటుంబం విలాసవంతమైన కారులో వేదిక వద్దకు చేరుకున్నారు. జామ్‌నగర్ విమానాశ్రయంలో దేశ, విదేశీ అతిథులకు ఘనస్వాగతం లభించింది. చాలా మంది విదేశీ అతిథులు విమానాశ్రయంలో భారతీయ స్వీట్ల రుచిని ఆస్వాదిస్తూ కనిపించారు.
View this post on Instagram
View this post on Instagram
శుక్రవారం సాయంత్రం 5.30గంటలకు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మూడు రోజులు పాటు సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా ఈ వేడుకలు జరగనున్నాయి. అనంత్, రాధిక ఎంగేజ్ మెంట్ 2023 జనవరిలో ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాలో జరిగిన సంగతి తెలిసిందే. జులై వీరిద్దరూ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
Also Read: అనంత్-రాధికా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో..ఆ పాప్ సింగర్ రెమ్యూనరేషన్ తెలుస్తే షాక్ అవుతారు.!