US Visa : అమెరికా వీసా ఫీజులు(America Visa Fees) పెరిగిపోయాయి. ఎనిమిది ఏళ్ళ తర్వాత వాసీ ఫీజులను పెంచాలని అక్కడి ప్రుత్వం నిర్ణయం తీసుకుంది. చివరిసారి 2016లో వీసా ఫీజులను పెంచారు. మళ్ళి ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఇవి పెరుగుతాయని యునైటిడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(United States Citizenship Immigration Services) తెలిపింది. H-1B, ఎల్-1, ఈబీ-5 వీసాలకు ఇది వర్తించనుంది.
కొత్త ఫీజులు..
హెచ్-1, ఎల-1, ఈబీ-5 అప్లై చేయాలనుకునేవారు I-129 ఫామ్‌ను ఫిల్ చేయాలి. దీని ఖరీదు ఇంతకు ముందు 460 డాలర్లు ఉండగా ఇప్పుడు అది 780 డాలర్లు అయింది. ఇండియన్ రూపీస్‌లో అయితే 38,000 నుంచి 64,000కు పైగా పెరుగుతోంది. ఇది కాకుండా హెచ్-1B రిజిస్ట్రీషన్ ఫీజును కూడా భారీగా పెంచేశారు. ఇంతకు ముందు ఈ ఫీజు 10 డాలర్లు ఉండగా ఇప్పుడు అది ఏకంగా 215 డాలర్లు అయింది. దీంతో పాటూ ఎల్-1 వీసా రుసుము కూడా మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు ఉండగా ఇప్పుడు అది 1385 డాలర్లు అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో 1,10,000రూ, అన్నమాట. ఎల్-1 అమెరికాలో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కిందకు వస్తుంది.
ఇవి రెండే కాదు ఈబీ-5 వీసా రేట్లు(EB-5 Visa Rates) కూడా బాగా పెరిగిపోయాయి. పై రెండింటిలానే దీని ఫీజు కూడా మూడు రెట్టు అధికం అయ్యాయి. ప్రస్తుతం ఇది 3675 డాలర్లు ఉండగా అది మూడు రెట్లు పెరిగి 11160 డాలర్లు అయింది. ఇందియన కరెన్సీలో దీని వాల్యూ సుమారు 9లక్షలురూ.
ఇండియా(India) నుంచి అమెరికా వెళ్ళడానికి చాలా మంది భారతీయులు ఇష్టపడతారు. గతేడాది భారతీయులకు రికార్డు స్థాయిలో 14లక్షల వీసాలను జారీ చేసింది అమెరికా. 2023-24 ఏడాదిలో ఇండియన్స్…వారి కుటుంబసభ్యులకు 3.80 లక్షల ఉద్యోగ వీసాలు జారీ చేసింది. ఇక విద్యార్ధులకు ఇచ్చే వీసా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ముంబయ్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలు ప్రపంచంలోనే మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి.
Also Read : Telangana: ఇంకా ఖరారు కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి..చక్రం తిప్పుతున్న పొంగులేటి