Gumma Thanuja Rani: వైసీపీ ఎంపీ గుమ్మా తనుజా రాణి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పలు గిరిజన,రాష్ట్ర సమస్యలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక చట్టం ద్వారా అయినా గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని స్థానిక గిరిజనులకే కేటాయించాలి అని విజ్ఞప్తి చేశారు.
కర్ణుడికి కవచ కుండలు ఎంత ముఖ్యమో గిరిజన ప్రాంతానికి జీవోనంబర్ 3 అత్యంత అవసరం అని, అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ పండించే మా గిరిజన రైతులకు ప్రయోజనం మాత్రం శూన్యం అని, అరుకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది దీనివలన మధ్యవర్తులు దళారులు లబ్ధి పొందుతున్నారు.
కానీ పండించిన రైతు నష్టపోతున్నాడు. కనుక ఒక గిరిజన కాఫీ సొసైటీ స్థాపించి ఉద్యోగ నియామకాలు గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయించి సొసైటీ ద్వారా కాఫీ కొనుగులు చేపడితే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్లు కూడ అవుతుంది అని రాష్ట్రపతికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది అని వైసీపీ పార్టీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి అని శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి అని ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది అని రాష్ట్రపతికి వివరించారు.
వైయస్ఆర్ సీపీ ఎంపీ గుమ్మా తనుజా రాణి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పలు గిరిజన,మరియు రాష్ట్ర సమస్యలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక చట్టం ద్వారా అయినా గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని స్థానిక గిరిజనులకే కేటాయించాలి అని విజ్ఞప్తి చేశారు.