Gangs Of Godavari Trailer : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా వేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కాస్త సినిమాపై అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేసింది.
విశ్వక్ ఊరమాస్ ఫెర్ఫార్మెన్స్
ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమా 1990’s రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో విలేజ్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఓ సామాన్య యువకుడు నాయకుడిగా ఎలా మారాడు? ఆ సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి?వాటిని హీరో ఎలా ఎదుర్కొని నాయకుడిగా నిలబడ్డాడు?అనేదే సినిమా కథ.. ఇక ట్రైలర్ లో విశ్వక్ సేన్ మునుపెన్నడూ కనిపించని మాస్ అవతార్ లో అదరగొట్టాడు.
Also Read : ప్రభాస్ ‘బుజ్జి’ని నడిపిన నాగ చైతన్య.. వైరల్ అవుతున్న వీడియో!
ముఖ్యంగా కోర మీసాలతో గోదావరి యాసలో విశ్వక్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. అందులో కొన్ని బూతు పదాలు కూడా వాడుతూ చెప్పిన డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ డైలాగ్స్ ని రేపు థియేటర్స్ లో ఉంచుతారో? లేదో తెలీదు కానీ, ఈ డైలాగ్స్ అయితే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసాయి. అన్నట్లు ఈ సినిమాలో మన తెలుగమ్మాయి అంజలి ఓ వైలెంట్ రోల్ లో కనిపించింది. మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో విశ్వక్ సేన్ ఖాతాతో ఊరమాస్ హిట్ పడటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.