Gangs Of Godavari : మన మీదికి ఎవడైనా వస్తే వాడి మీద పడిపోవడమే.. విశ్వక్ ఊరమాస్ ఫెర్ఫార్మెన్స్, అదిరిపోయిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్!

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో విశ్వక్ సేన్ మాస్ అవతార్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా కోర మీసాలతో గోదావరి యాసలో విశ్వక్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. అందులో కొన్ని బూతు పదాలు వాడుతూ చెప్పిన డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే.

New Update
Gangs Of Godavari : మన మీదికి ఎవడైనా వస్తే వాడి మీద పడిపోవడమే.. విశ్వక్ ఊరమాస్ ఫెర్ఫార్మెన్స్, అదిరిపోయిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్!

Gangs Of Godavari Trailer : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా వేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కాస్త సినిమాపై అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేసింది.

విశ్వక్ ఊరమాస్ ఫెర్ఫార్మెన్స్

ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమా 1990's రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో విలేజ్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఓ సామాన్య యువకుడు నాయకుడిగా ఎలా మారాడు? ఆ సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి?వాటిని హీరో ఎలా ఎదుర్కొని నాయకుడిగా నిలబడ్డాడు?అనేదే సినిమా కథ.. ఇక ట్రైలర్ లో విశ్వక్ సేన్ మునుపెన్నడూ కనిపించని మాస్ అవతార్ లో అదరగొట్టాడు.

Also Read : ప్రభాస్ ‘బుజ్జి’ని నడిపిన నాగ చైతన్య.. వైరల్ అవుతున్న వీడియో!

ముఖ్యంగా కోర మీసాలతో గోదావరి యాసలో విశ్వక్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. అందులో కొన్ని బూతు పదాలు కూడా వాడుతూ చెప్పిన డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ డైలాగ్స్ ని రేపు థియేటర్స్ లో ఉంచుతారో? లేదో తెలీదు కానీ, ఈ డైలాగ్స్ అయితే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసాయి. అన్నట్లు ఈ సినిమాలో మన తెలుగమ్మాయి అంజలి ఓ వైలెంట్ రోల్ లో కనిపించింది. మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో విశ్వక్ సేన్ ఖాతాతో ఊరమాస్ హిట్ పడటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు