Flipkart Big Billion Days 2023: ఈ – కామర్స్ దిగ్గజాలు అయినటువంటి అమెజాన్ (Amazon), ఫ్లిప్ కార్ట్ (Flipkart)ఆఫర్ల సందడి నడుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటూ వినియోగదారుల ముందుకు వస్తే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అంటూ అదరగొడుతోంది. ఇప్పటికే అన్ని రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు ధరలను అందజేస్తుంది.
స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్స్, యాక్సెసరీస్ వంటి వస్తువులపై ఫ్లిప్కార్ట్ బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల (Smart Phones) మీద. బిగ్ బిలియన్ డేస్ లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22:
బిగ్ బిలియన్ డేస్ సేల్ లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 (Samsung Galaxy S 22) ధర రూ. 39,999 కి తగ్గిపోయింది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల మీద మరింత తక్కువ ధరకే ఇవి లభిస్తున్నాయి. 8 జీబీ ర్యామ్, 50 ఎమ్పీ ప్రైమరీ కెమెరా తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్, 10 ఎమ్పీ సెల్ఫీ షూటర్ వంటి ఫీచర్లతో గెలాక్సీ ఎస్ 22 మార్కెట్లో రిలీజ్ అయ్యింది.
Also Read: 1 లక్షకే హ్యుందాయ్ i10 కారు.. కానీ..
ఐ ఫోన్ 14
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో ఐ ఫోన్ 14 (Iphone 14) ను కేవలం 56,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు డిస్కౌంట్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో చాలా తక్కువ ధరకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
మోటొరోలా ఎడ్జ్ 40
మోటొరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40) ఫోన్ తాజా ఫ్లిప్కార్ట్ సేల్లో రూ.24,999కి లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు తో దీనిని తక్కువ ధరకే వినియోగదారుల సొంతం చేసుకోవచ్చు.
ఐక్యూ నియో 7
ఐక్యూ నియో 7 (IQOO Neo 7) 5G ఫోన్ను ఫ్లిప్కార్ట్ ఆఫర్లలో రూ.28,999కి కొనవచ్చు. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.
ఒప్పో రెనో 8
ఒప్పో రెనో 8 (OPPO) ఫోన్ను ఫ్లిప్కార్ట్ సేల్లో కేవలం రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు. 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ దీని సొంతం.