అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా నడుపుతున్న ట్రేడింగ్ రికమెండేషన్ సంస్థల మీద చర్యలు తీసుకోవడం ప్రారంభించింది సెబీ. ఇందులో భాగంగా మొట్టమొదటగా మూడు కంపెనీల మీద వేటు వేసింది. ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూయెర్స్ గా ఉన్న మూడు సంస్థలను వెంటనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వీరు ఇన్వెస్టర్ల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన మొత్తం 17.2 కోట్ల రూపాయలను తిరిగి వారికే ఇచ్చేయాలని ఆర్డర్ వేసింది. ఇందులో బాప్ ఆఫ్ చార్ట్ పేరుతో ట్రేడింగ్ రికమెండేషన్స్ చేస్తున్న మహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు అయిన టెలీ గ్రామ్, ఎక్స్, యూట్యూబ్ లలో ట్రేడింగ్ సజెషన్స్ ఇస్తుంది. అన్సారీతో పాటూ గోల్డెన్ సిండికేట్ వెంచర్స్ నడుపుతున్న రాహుల్ రావు పడమటి, వారి అనుబంధ సంస్థలను కూడా రద్దు చేసింది.
Also Read:ఆ అధికారులను వెంటనే తొలగించండి: రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్
అన్సారీ స్టాక్స్ కు సంబంధించిన సిఫార్సులను అందించారు కానీ మార్కెట్-సంబంధిత విద్యా శిక్షణను ఇచ్చే ముసుగులో విక్రయించడానికి ప్రయత్నించారని సెబీ ఆరోపిస్తోంది. మిగతా కంపెనీలది కూడా ఇదే పరిస్థితి. అందుకే సెబీ ఈ మూడు సంస్థలను వెంటనే ఆపేయాలి లేదా తన వ్యాపారం నుంచి విరమించాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్లుగా ఇక మీదట వాళ్ళు పని చేయకూడదని చెప్పింది. ఈ రకమైన షోకాజ్ నోటీసులను బాప్ ఆఫ్ చార్ట్ తో పాటూ మిగతా రెండు కంపెనీలకు పంపించింది సెబీ.
నసీర్, రాహుల్ రావులిద్దరూ చాలా డబ్బును సంపాదించారని…అది కూడా ఎడ్యుకేషనల్ కోర్సెస్ పేరుతో అని ఆరోపిస్తోంది సెబీ. ట్రేడింగ్ లో బోలెడంత డబ్బును సంపాదించొచ్చు అంటూ ఫాల్స్ ప్రచారాలతో ఇన్వెస్టర్లను మోసం చేశారని చెబుతోంది. కోర్సెస్ రూపంలో అన్సారీ లైవ్ ట్రేడింగ్ చేసేవాడని సెబీ ఆఫీసర్ అనంత్ నారాయణ్ చెప్పారు. సెబీ రూల్స్ ప్రకారం కాకుండా వీరు ఫ్రాడ్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేశారని తెలిపారు.
ఇలాంటి మోసపూరితమైన కంపెనీల మీద సెబీ ఇక మీదట కఠన చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఫిన్ ఫ్లూయెర్స్ పేరుతో చేసే రికమెండేషన్లను నమమ్మొద్దని చెబుతోంది. రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ను మాత్రమే నమ్మాలని సూచిస్తోంది. రిజిస్టర్ కాని సంస్థలను వెంటనే మూసేయాలని హెచ్చరించింది సెబీ.