Egg Bajji : చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హఠాత్తుగా మరణించడంతో అందరూ దిగ్భ్రాంతికి గురవుతుంటారు. రెప్పపాటు క్షణాల్లో అంతా జరిగిపోతుంది. ఒక్కోసారి మనం ఎంతో ఇష్టంగా తినే పదార్ధాలు కూడా మన ప్రాణాలను తీస్తాయని తెలుస్తే షాక్ అవుతాం. తాజాగా అలాంటి ఘటనే వనపర్తి జిల్లాలో జరిగింది. ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే …మదనాపురం మండలంలోని గోవిందహళ్లికి చెందిన గొల్ల తిరుపతయ్యకి బజ్జీలు అంటే ఎంతో ఇష్టం బుధవారం సాయంత్రం ఇంటి ముందు కూర్చుని కోడిగుడ్డు బజ్జీలు తింటున్నాడు. ఇంతులో బజ్జీ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక కింపడిపోవడం గమనించిన తిరుపతయ్య భార్య సువర్ణ గొంతులో నుంచి బజ్జీని తీసేందుకు ఎంతో ప్రయత్నించింది. సవర్ణ అరుపులు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి వచ్చి గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీని బయటకు తీశారు. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. ఊపిరాడక తిరుపతయ్య అప్పటికే మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఇష్టంతో తినే బజ్జీలు తిరుపతయ్య ప్రాణం తీసిందంటూ చుట్టుపక్కలవారు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇది కూడా చదవండి: ఓపీఎస్ అమలు చేయకుంటే రైలు సేవలు నిలిపివేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక