Hyderabad: ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, సాకేంతకంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. అమాయకులే లక్ష్యంగా ఆన్ లైన్ వేదికగా దోపిడీలకు పాల్పడుతున్నారు. అకౌంట్లను హ్యాక్ చేస్తూ అందినకాడికి దొచేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరుతో హైదరాబాద్ కు చెందిన యువతికి వల విసిరిన నేరగాళ్లు రూ.7.50 లక్షలు దోచేశారు.
క్రెడిట్ కార్డు బిల్ పూర్తిగా చెల్లించాలంటూ..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు బిల్ పూర్తిగా చెల్లించాల్సి ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే తనకు క్రెడిట్ కార్డు లేదని ఆమె చెప్పినప్పటికీ.. కస్టమర్ కేర్‌తో మాట్లాడాలంటూ మరొకరికి కాల్ ఫార్వర్డ్ చేశాడు. అతను బాధితురాలి ఆధార్ నెంబరు చెక్ చేసి.. ముంబై, తమిళనాడు, బిహార్‌తో పాటు పలు ప్రాంతంలో తన పేరిట క్రెడిట్ కార్డులు వాడుతున్నారని, ఇప్పటికీ రూ. 25-30 లక్షల ట్రాన్సాక్షన్స్ జరియంటూ భయాందోళనకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా మనీలాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదవుతుందని, ఈ విషయం ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్పారు. అంతేకాదు సీబీఐ విచారలోనూ బటయపెట్టద్దంటూ అయోమయంలో పడేశారు.
వాళ్ల అకౌంట్ కు రూ. 7.50 లక్షలు..
అయితే బెదిరింపులకు నిజంగానే భయపడిపోయిన యువతి.. వాళ్ల అకౌంట్ కు రూ. 7.50 లక్షలు పంపింది. దర్యాప్తు పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని నేరగాళ్లు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మింది. ఈ విషయాన్ని తన స్నేహితులతో షేర్ చేసుకోగా.. చివరికి తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి బాధితురాలి డబ్బు రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.