Bealert : రోజుకో గుడ్డు తిను ఆరోగ్యంగా ఉండు..రోజుకో గుడ్డు(EGG) తింటే డాక్టర్ తో పని ఉండదు..ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. గుడ్డు మన ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలుసు. వైద్యులు కూడా రోజుకో గడ్డు తినమని సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ప్రతిరోజూ ఉదయం గుడ్డు తినిపిస్తే శరీరానికి కావాల్సిన మాంసక్రుత్తులన్నీ అందుతాయి. అంతేకాదు గుండె ఆరోగ్యానికి గుడ్డు ఎంతో మేలు చేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే గుడ్డు తినాల్సిందే. అంతకాదు జ్నాపకశక్తి పెరగాలన్నా..పిల్లలు ఎదగాలన్నా గుడ్డు తినిపించాలని. ఎముకలను ఉక్కులా గట్టిగా ఉంచుంది. గుడ్డులో తెల్ల సొన కంటే…గుడ్డులో ఉండే పచ్చ సొనలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్ డి కూడా పచ్చసొన నుంచే మనకు లభిస్తుంది.
విటమిన్ డి, తోపాటు బి కూడా పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని ప్రొటీన్ రక్తపోటును తగ్గించి..ఎముకలను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న గుడ్డును రోజుకోటి తిన్నా సరిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే గుడ్డ తినేవారు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని చెబుతారు. అయితే తాజాగా గుడ్డు ఓ చిన్నారి ప్రాణం తీసింది. సిద్దిపేట జిల్లా(Siddipet District) దౌర్తాపూర్(Doortapur) గ్రామంలో ఈ విషాధ ఘటన చోటుచేసుకుంది.
ప్రతిరోజూ గుడ్డ తింటే తన చిన్నారి ఆరోగ్యంగా ఉంటాడని భావించిన సంగీత అనే మహిళ ప్రతిరోజూ తన కుమారుడికి గుడ్డు తినిపిస్తుండేది. ఈ క్రమంలో సంగీత గుడ్డు పొట్టు తీసి చిన్నారి చేతికి ఇచ్చింది. తర్వాత ఆ పిల్లాడిని అక్కడే వదిలేసి వంటగదిలోకి వెళ్లింది. ఆ పిల్లాడు గుడ్డును నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కుపోయింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవడంతో పిల్లాడు కొంతసేపటివ వరకు అలాగే పడి ఉన్నాడు. తర్వాత పేరెంట్స్ వచ్చి చూసి వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు..!!
తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం తినిపించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బలమైన ఆహారం ఇచ్చేటప్పుడు పిల్లలు వాటిని ఎలా తింటున్నారో గమనించాలి. గుడ్డు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలి. చపాతీ లాంటి ఆహారం కూడా మెత్తగా ఉన్నది చిన్న చిన్న ముక్కలు చేసి తినిపించాలి. పిల్లలు పూర్తిగా తినేవరకు దగ్గరే ఉండాలి.