Fire Incident in Delhi Children’s Hospital: ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని (Vivek Vihar) పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో.. ఏడుగురు శిశువులు మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో 12 మంది చిన్నారులను సహాయక బృందం రక్షించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. IPL ఫైనల్‌కు వర్షం ముప్పు