DGCA Imposed Fine On Air India : తరచూ సిబ్బంది అలసత్వంతో చిక్కుల్లో పడే ఎయిర్ ఇండియా మరోసారి ఇబ్బందుల్లో పడింది. ఇటీవల ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్(Chhatrapati Shivaji Maharaj International Airport) వద్ద 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఈ కేసులో ఎయిర్ ఇండియాకు గురువారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆ వృద్ధుడి మరణానికి.. ఎయిర్ ఇండియాకు కనెక్షన్ ఏమిటంటే.. నిజానికి, ఆ వృద్ధుడు వీల్‌చైర్ కోసం సిబ్బందిని డిమాండ్ చేశాడు, దానిని ఎయిర్ ఇండియా(Air India) వీల్ ఛైర్ అందించడంలో విఫలం అయింది. దీంతో ఆ వృద్ధుడు నడుచుకుంటూ వెళుతుండగా గుండెపోటు(Heart Attack) కు గురై మరణించాడు. విమానయాన సంస్థలు ఫిబ్రవరి 16న ఈ సమాచారాన్ని అందించాయి.
Also Read : ఊహించిన దానికంటే ఎక్కువగా.. జీడీపీ వృద్ధి.. ఎంతంటే..
వెయిట్ చేయమని చెప్పినా..
వృద్ధుడి మరణం విషయంలో DGCA ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు పంపింది. దీనికి విమానయాన సంస్థ (Air India) స్పందిస్తూ – “ఒక వృద్ధ జంట అమెరికా నుండి వచ్చారు. భార్యాభర్తలిద్దరూ వీల్ చైర్ కావాలని డిమాండ్ చేశారు. అతని భార్యఅప్పటికే వీల్ ఛైర్ లో ఉంది. అతను తన భార్యతో కలిసి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాడు. నిజానికి ఆ రోజు వీల్ చైర్లకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా, మేము మరొక వీల్‌చైర్(Wheel Chair) ను ఏర్పాటు చేయడానికి కొంత సమయం వేచి ఉండమని వారిని కోరాము. కానీ, అతను తన భార్యతో కాలినడకన వెళ్ళాడు. అలా కొంతసేపు నడిచిన తర్వాత వృద్ధుడు కిందపడిపోయాడు. ముంబై విమానాశ్రయం(Mumbai Airport) లో వైద్య సదుపాయాలు అందించిన తర్వాత, నానావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే అతను మరణించాడు. మరణానికి కారణం గుండెపోటు అని తెలిపారు.” అంటూ వివరణ ఇచ్చింది.
కానీ, డీజీసీఏ ఆ వివరణతో సంతృప్తి చెందలేదు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను 30 లక్షల జరిమానా ఎయిర్ ఇండియా(Air India) కు విధించింది.