TDP: విజయవాడలోని వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు. టీడీపీ విజయం సాధించిన కేవలం కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవడంతో… టీడీపీ ప్రభుత్వం చేసిన మొదటి పని ఇదే అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారు.
టీడీపీ కార్యకర్తలు యూనివర్సిటీ పేరులోని అక్షరాలను మార్చి సంబరాలు చేసుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సీటీని పేరును వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించి ఆ సమయంలో పెద్ద గొడవలే జరిగినప్పటికీ జగన్ మాత్రం ఆ పేరును అలానే ఉంచారు. ఆ సమయంలో టీడీపీ నుంచే కాకుండా రాష్ట్ర ప్రజల నుంచి కూడా పేరు మార్పు విషయం గురించి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. 2024 టీడీపీ అధికారంలోకి రాగానే యూనివర్సిటీ పేరు మార్చడంతో టీడీపీ వర్గీయులతో పాటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
YSR name removed from NTR university pic.twitter.com/maNo5cK5QE
— Praveen (@Praveen___KP) June 4, 2024