నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండగా మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. ఈ మేరకు ఆదివారం దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న నటులు ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట అభిమానులతో షేర్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి ఈ పండుగను జరుపుకోగా రష్మిక కూడా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది.
Happy Diwali my loves ❤️✨ pic.twitter.com/XaPQwRR56O
— Vijay Deverakonda (@TheDeverakonda) November 12, 2023
అయితే ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా బ్యాక్ గ్రౌండ్‌పై కన్నేశారు నెటిజన్లు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తమ ఇంటిని బంతిపూలు, మామిడి ఆకులు, లైట్స్, దీపాలతో అందంగా అలంకరించారు. ఈ క్రమంలోనే గతరాత్రి రష్మిక తన ఇన్‌స్టాలో ‘హ్యాపీ దీపావళి మై లవ్స్’ అంటూ చీరకట్టులో ఓ బెంచ్‌పై కూర్చున్న ఫొటోలను పంచుకోగా.. రష్మిక పోస్ట్ చేసిన కొద్ది సేపటికే విజయ్ దేవరకొండ కూడా ‘హ్యాపీ దీపావళి మై లవ్స్’ అంటూ ఫ్యామిలీతో కలిసి దిగిన పిక్స్ షేర్ చేశారు. అయితే రష్మిక షేర్ చేసిన ఫొటోల్లోనూ విజయ్ ఫ్యామిలీ ఉన్న ఇంటి లోకేషన్‌కు రష్మిక ఉన్న లోకేషన్ మ్యాచ్ అవుతుంది. ఈ రెండు పోస్ట్‌ల్లోని ఫొటోల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న గోడలు ఒకలాగే కనిపించాయి. అంతేకాదు గోడకు వేలాడదీసిని లైట్స్ డిజైన్స్ సేమ్ కనిపించాయి. దీంతో విజయ్ దేవరకొండ తన ఇంట్లో దీపావళి వేడుకలు రష్మిక వచ్చిందంటూ నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ‘పెళ్లికి ముందే అత్తగారింట్లో దీపావళి జరుపుకుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలంటున్నారు ఫ్యాన్స్.
Happy Diwali my loves ✨🤍 pic.twitter.com/2qE2xD9UNw
— Rashmika Mandanna (@iamRashmika) November 12, 2023
Also Read :పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఇదిలావుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్ గురించి స్పందించిన రష్మిక ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదంతా రూమర్ అంటూ కొట్టిపారేసింది. ఏదిఏమైనా ఎవరో ఒకరి పెళ్లి అయితే తప్పా.. ఈ పుకార్లకు బ్రేక్ పడేటట్లు లేదంటున్నారు మరికొంతమంది అభిమానులు. ఇక ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జోడీ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ తోనూ మెప్పించారు.
Deverakonda Family #Diwali celebrations#VijayDeverakonda #Rashmika #AnandDeverakonda pic.twitter.com/o7vaGxC975
— Telugubit (@telugubit) November 12, 2023