Kollywood Actress Priya Bhavani Shankar : కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన అభిమానులు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ఇండియన్ 2 సినిమా విషయంలో తన పాత్రపై వచ్చిన విమర్శల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదలైన తర్వాత ఆమె పాత్రపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రియా భవాని శంకర్ దీనిపై తాజాగా స్పందించారు.
Also Read : రామ్ చరణ్ వల్లే ఆ సినిమాలో నటించా.. తమిళ్ హీరో ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నా కెరీర్లో నేను సంతకం చేసిన భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ మూవీ ఒప్పుకోగానే నాకు ఎన్నో ఛాన్సులు వచ్చాయి. పెద్ద సినిమాలు చేస్తేనే హీరోయిన్గా భావిస్తున్నారు. ఇకపోతే ఫ్లాప్ అవుతాయని ముందే తెలిస్తే ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవ్వాలనే కష్టపడతారు.
కమల్ -శంకర్ సర్ కాంబినేషన్లో మూవీని ఎవరు వద్దనుకుంటారు? కానీ జనాలు నన్ను మాటలతో వేధిస్తున్నారు. అందుకు బాధగా ఉంది. మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ.. సినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి. కానీ నేనే కారణమంటే మనసుకు బాధేస్తోంది” అని చెప్పుకొచ్చింది.