Best Food Cities: ప్రతీ వంటకం ప్రాంతీయ సాంప్రదాయాల గుర్తింపును కలిగి ఉంటుంది. లోకల్ ఫుడ్స్ ఆ ప్రాంతం సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా ఉంటాయి. అయితే ఇటీవలే టేస్ట్ అట్లాస్ అనే ఆన్లైన్ ట్రావెల్ గైడ్ సంస్థ ప్రపంచంలో టాప్ 100 బెస్ట్ ఫుడ్ సిటీస్ జాబితాను విడుదల చేసింది. ఈ టాప్ 100 జాబితాలో భారత దేశానికి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంతే కాదు ఆ సిటీస్ లో పాపులర్ ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ కూడా తెలిపారు. ఇండియన్ బెస్ట్ ఫుడ్ సిటీస్ గా ఎంపికైన ప్రాంతాలు ఇవే..
టాప్ బెస్ట్ ఇండియన్ సిటీస్
ఇందులో టాప్ 50 ఉన్న సిటీస్ గా హైదరాబాద్, ముంబై చోటు దక్కించుకున్నాయి. 35 వ స్థానంలో హైదరాబాద్, 39 వ స్థానంలో ముంబై ఉన్నాయి. ఢిల్లీ 56 వ స్థానంలో, చెన్నై 65 వ స్థానంలో లక్నో 92 వ స్థానంలో ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో లభించే పాపులర్ ఐటమ్స్
ఢిల్లీ, ముంబై
ఆలూ టిక్కీ, గోల్ గప్పే, పాప్డీ చాట్, దహీ భల్లా, సెవ్ పూరీ, భేల్ పూరీ, రగ్దా పట్టీస్, వడ పావ్, పావ్ భాజీ వంటి వివిధ రకాల చాట్ కు సంబందించిన ఆహారాలకు ఢిల్లీ, ముంబై ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. ఇవి స్ట్రీట్ ఫుడ్స్.. ఒక్కొక్క ప్రాంతాల్లో వెరైటీ రుచితో ఉంటాయి. ఇక్కడ మరి కొన్ని పాపులర్ డిషెస్ కూడా రుచి చూడవచ్చు. ఆలూ పరాథ, చికెన్ కర్రీ, బటర్ చికెన్, దాల్ మఖానీ.
హైదరాబాద్
హైదరాబాద్ సిటీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే ఫుడ్ బిర్యానీ. దీంతో పాటు ఫుడ్ లవర్స్ కు నచ్చే పాపులర్ ఐటమ్స్ హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. హలీమ్, చికెన్ 65, బోటీ కబాబ్, కీమా సమోసా, పాయా, నిహారి ఇలా హైదరాబాద్ లో ఎన్నో రకాల టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఎంజాయ్ చేయొచ్చు.
Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!
చెన్నై
చెన్నైలో రుచికరమైన ఇడ్లీ, దోస, వంటి స్థానిక ఆహారాలకు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ టేస్ట్ చేయడానికి చాలా రకాల వెరైటీ డిషెస్ ఉన్నాయి. పనియారం, వడ, భాజీ, పకోడా, పుట్టు, ఫిల్టర్ కాఫీ, ముల్లిగాటవ్నీ సూప్, సుండాల్, మురుక్కు శాండ్విచ్, ఊతప్పం, అథో, కోతు పరోటా వంటి రుచికరమైన ఆహారాలు ఇక్కడ దొరుకుతాయి. ఈ ఆహారాలకు చెన్నై సిటీ ఫేమస్ కూడా.
లక్నో
కబాబ్స్, బిర్యానీ వంటి మొఘల్ వంటకాలకు లక్నో బాగా ప్రసిద్ధి చెందినది అని అందరికీ తెలుసు. కానీ లక్నోలో ఇంతకంటే రుచికరమైన, ప్రసిద్ధి చెందిన ఆహారాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కటోరి చాట్, రోఘన్ జోష్, నిహారీ కుల్చా, ఖాస్తా కచోరీ నుండి షీర్మల్, బన్ మక్ఖాన్ చాయ్, కుల్ఫీ ఫలూదా మరియు మక్ఖాన్ మలైని తప్పకుండా ఆస్వాదించాల్సిన ఫుడ్స్. ముఖ్యంగా మఖన్ మలై డెజర్ట్ చాలా పాపులర్.
Also Read: Round Wells: గుండ్రని బావులే ఎందుకు.. దీని వెనుక స్టోరీ ఇదే..!