Srikakulam: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎలుగు బంటి దాడి ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు అప్పికొండ కుమార్(45) లోకనాథం(55)గా గుర్తించారు. సిరిపల్లి సావిత్రికు తీవ్ర గాయాలు అవ్వడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో సంచరిస్తున్న ఎలుగుబంట్లపై స్థానిక ప్రజలు భయాందోళనలో బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.