Pak Attacks:బలూచిస్థాన్ మీద ఇరాన్ చేసిన దాడులకు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన పాకిస్తాన్ అన్నట్టుగానే 24 గంటల్లోపే ప్రతీకార దాడులను చేపట్టింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ అనే రెండు గ్రూప్‌ల మదీ పాకిస్తాన్ దాడులు చేసిన్టుట తెలుస్తోంది. ఇరాన్ సిస్థాన్, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉన్న సరవన్ అనే ప్రాంతంలో ఈ రెండూ ఉన్నాయి.
Also read:ఎన్టీయార్ 28 వర్ధంతి ఈరోజు…నివాళులర్పించిన కుటుంబసభ్యులు
పాక్ మీద ఇరాన్ దాడులు…
అంతకు ముందు తీవ్రవాదం, ఉగ్రవాదాలను నిర్మూలిస్తామంటూ క్షిపణులతో (Missiles) ఇరాన్ దాడులు చేసింది.ముందు సిరియా, ఇరాక్లలో దాడు చేసింది. వీటి తరువాత పాకిస్తాన్ మీద కూడా తన గురి ఎక్కుపెట్టింది ఇరాన్. పాకిస్తాన్లో బలూచిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాల మీద క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని..ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది.
తీవ్ర పరిణామాలు తప్పవన్న పాక్..
అయితే ఈ దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తోంది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇద్దరు పిల్లలు చనిపోయారని (Two Children Killed)…మరో ముగ్గురు తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిపింది. ఇరాన్ చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలిచి మరీ ఈ విషయాన్ని చెప్పింది పాకిస్తాన్ ప్రభుత్వం. తమ దేశ సార్వభౌమాధికారాన్నే సవాల్ చేశారని అంటోంది. పాక్ గగనతలాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది. పాక్ హెచ్చరించినట్టుగానే ఇప్పుడు ప్రతీకార చర్యలను చేపట్టింది.
ఆత్మ రక్షణ కోసమే అంటున్న భారత్..
మరోవైపు పాకిస్థాన్‌లోని జైష్ అల్-అద్ల్ స్థావరాలపై ఇరాన్ దాడులు (Iran Attacks) చేయడంపై భారత్ స్పందించింది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న అంశమని వ్యాఖ్యానించింది. “దేశాలు తమ ఆత్మరక్షణ (Self Defence) కోసం తీసుకుంటున్న చర్యలుగా అభివర్ణించింది భారత్ (Bharat). ఉగ్రవాదాన్ని సహించేది లేదని, భారత్‌కు రాజీలేని వైఖరి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు.