Rajamouli Bahubali : తెలుగు సినీ పరిశ్రమకు ‘పాన్ ఇండియా’ అనే పదాన్ని పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా ప్రభాస్, రాజమౌళి ను పాన్ ఇండియా స్టార్స్ చేసింది.
ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అందులో ముఖ్యంగా భల్లాలదేవుడు అంటే ప్రత్యేక ప్రస్తావన అవసరం లేదు. ఈ పాత్రలో దగ్గుబాటి రానా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. అయితే నిజానికి ఈ పాత్రకు మొదటి ఎంపిక ఓ హాలీవుడ్ స్టార్ హీరో అనే సంగతి మీకు తెలుసా?
Also Read : ప్రభాస్ ‘రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ పై థమన్ అదిరిపోయే అప్డేట్..!
అవును, మీరు చదివినది నిజమే. హాలీవుడ్ హల్క్ ‘ఆక్వామెన్’ ఫేమ్ జేసన్ మోమోవానే మొదట భల్లాలదేవుడిగా ఎంపిక చేశారట దర్శకడు రాజమౌళి. ఆయన ఫిజిక్ చూసి ఈ పాత్రకు ఆయనే సరైన వ్యక్తి అని జక్కన్న భావించారు. కానీ, అప్పటికే హాలీవుడ్లో బిజీగా ఉన్న జేసన్ మోమోవా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ పాత్ర కోసం ఎంతోమందిని పరిశీలించిన తర్వాతే రానాను ఎంపిక చేశారు.
ఈ విషయం నెట్ఫ్లిక్స్ ‘మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి’ అనే డాక్యుమెంటరీలో భాగంగా బయటికొచ్చింది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బాహుబలిలో భల్లాల దేవ పాత్ర జేసన్ మోమోవా చేసి ఉంటె నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని, హాలీవుడ్ లోనూ మన సినిమా సత్తా చాటేదని కామెంట్స్ చేస్తున్నారు.