Tamannaah Bhatia: బోల్డ్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) స్టార్ డైరెక్టర్ రాజమౌళితో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. జక్కన్న తెరకెక్కించిన ‘బాహుబలి’లో (Baahubali) అవంతిక పాత్ర పోషించిన ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా తనను ఎంపిక చేసుకోవడం, క్యారెక్టర్ కు ఆ పేరు పెట్టడానికి గల సీక్రెట్స్ కు సంబంధించి ఓపెన్ అయింది.
Forces of Fashion, 2023 @VOGUEIndia 🔥🔥🔥 pic.twitter.com/CwD8lClg3w
— Tamannaah Bhatia (@tamannaahspeaks) November 29, 2023
సినిమా చరిత్రకే ఒక టర్నింగ్ పాయింట్..
రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..”బాహుబలి’ సినిమా మాకే కాదు ఇండియా సినిమా చరిత్రకే ఒక టర్నింగ్ పాయింట్. ఈ మూవీ తర్వాత ప్రపంచమంతా భారతీయ సినీ పరిశ్రమ గురించే మాట్లాడుకుంది. ఇంత గొప్ప సినిమాలో రాజమౌళి (Rajamouli) నాకు అవంతిక పాత్ర అప్పగించారు. దీంతో నటిగా నిరూపించుకోవడానికి నాకు గొప్ప అవకాశం దక్కింది. అయితే ఈ పాత్రకు నన్నే ఎంపిక చేయడానికి కారణమేమిటని చాలాసార్లు అడిగాను. ఆయన ఇప్పటివరకూ ఆన్సర్ చెప్పలేదు. నేను దాని గురించి అడిగిన ప్రతిసారీ నవ్వుతుంటారు. నా ప్రతిభను రాజమౌళి అర్థం చేసుకున్నారని, ఆ పాత్రలో నటించడం మొదలుపెట్టిన తర్వాతే తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చింది.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) October 20, 2023
ఇది కూడా చదవండి : Jayalalithaa: జయలలిత నగలు, స్థిరాస్తుల వేలం.. ఎన్నికోట్లు రానున్నాయంటే!
అలాగే ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మాట్లాడుకుంటున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొత్తలో తన పేరు మార్పుకోవాలని సూచించినట్లు తెలిపింది. అందుకే అదనంగా తన పేరులో మరో రెండు ఇంగ్లీష్ అక్షరాలను చేర్చుకున్నట్లు చెప్పారు.