Ayodhya: అయోధ్య రామ మందిరం సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని అయోధ్యలో ఈ రామమందిరం 2024 జనవరి 22 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అయితే మొదటి ఆరు నెలల్లో.. 11 కోట్ల మంది యాత్రికులు, పర్యాటకులు అయోధ్యను సందర్శించారు. అయోధ్యతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలను మొత్తం 33 కోట్ల మంది పర్యాటకులు సందర్శించినట్లు అధికారులు తెలిపారు. అయోధ్యను సందర్శించిన భక్తుల సంఖ్య ఇందులో ( 33 కోట్లలో 3 వంతుగా నిలిచిందని చెప్పారు. ఇక మందిరంలో రామ్ లల్లా (Ram Lalla) ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సం ప్రధాని మోడీ చేతుల మీదుగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన రెండు వారాల తర్వాత రామ భక్తులకు అయోధ్య ప్రధాన ఆలయంలోకి అనుమతించారు. దీంతో నాటి నుంచి నేటి వరకు దీనిని ఈ రోజు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారికంగా విడుదల చేసింది.
ayodhaya ram amndir
Ayodhya Ram Mandir: అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు.. 60 మంగల సూత్రాలు చోరీ..
Robbery in Ayodhya Ram Mandir: ఈ ఏడాది జనవరి 22న ఉత్తరపప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా రామమందిర ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజు నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు రాములవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. అయితే భక్తుల రద్దీని అవకాశంగా భావిస్తున్న దొంగలు (Thieves) రెచ్చిపోతున్నారు. భక్తులకు సంబంధించిన నగదు, బంగారం అలాగే ఇతర విలువైన భక్తులు ఎత్తుకెళ్తున్నారు. అయితే ఇటీవల కరీంనగర్‌కు (Karimnagar) చెందిన కొంతమంది భక్తులు రామ్‌లల్లాను (Ram Lalla) దర్శించుకునేందుకు అయోధ్యకు వెళ్లారు.
Also Read: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్ చేసిన విపక్షాలు
భద్రతాలోపం వల్లే
వాళ్లలో ఓ మహిళకు చెందిన బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. దీంతో ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటివరకు.. 60 మంది మహిళల మంగళ సూత్రాలు చోరీకి గురయ్యాయని పోలీసులు చెబుతున్నారు. మరోవిషయం ఏంటంటే.. రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన తర్వా భద్రతా ఏర్పాట్లను సడలించడం వల్ల దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చర్యలు తీసుకోండి
అంతేకాదు అక్కడ పలు ప్రాంతాల్లో ఉండే సీసీ కెమెరాలను కూడా తొలగించడం దొంగిలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పలుమార్లు దొంగతనాలు వెలుగుచూడటంతో అయోధ్యకు వచ్చే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని.. భద్రతను పటిష్ఠం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Ayodhya Ram Mandir: రామ మందిరం ప్రారంభోత్సవ దగ్గర పడుతున్న వేళ… టెస్లా కార్లతో రామ నామం!
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు దగ్గర పడుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా రామ నామ జపంతో భక్తి పరవశ్యంలో మునిగి తేలుతున్నారు. కేవలం భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ముందు అమెరికాలోని (America) 21 నగరాల్లోని రామ భక్తులు కార్ల ర్యాలీలు నిర్వహించారు. 100 మందికి పైగా రామ భక్తులు టెస్లా కార్లతో (Tesla Cars) వాషింగ్టన్ డీసీలోని మేరీల్యాండ్ శివారులోని ఫ్రెడరిక్ నగర్ లో శ్రీ భక్తాంజనేయ ఆలయానికి భక్తులు శనివారం రాత్రి అధిక సంఖ్యలో చేరుకున్నారు.
టెస్లా కార్లలోని ముఖ్య ఫీచర్లలో ఒకదానిని వారు ఉపయోగించుకుని టెస్లా కార్ల స్పీకర్లు రాముడికి అంకితం చేసిన పాటను ప్లే చేస్తూ ఉండగా కార్ల హెడ్ లైట్లు లైట్ గేమ్ ప్లే చేశాయి. కార్లన్నిటిని కూడా రామ్ అనే పేరు వచ్చే ప్యాట్రన్‌లో పార్క్ చేసి ఈ అద్భుతమైన థీమ్ ని ఆవిష్కరించారు.
ఈ ఈవెంట్ కోసం విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా తెలిపిన వివరాల ప్రకారం 200 మందికి పైగా టెస్లా కార్ల యజమానులు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నమోదు చేసుకున్ఆరు. ఈ ఈవెంట్ మొత్తాన్ని నిర్వాహకులు డ్రోన్ ల ద్వారా ఫోటోలు తీసారు. టెస్లా కార్లన్ని కూడా ‘RAM’గా కనిపించే విధంగా వరుసలో ఉన్నాయని చూపుతున్నాయి.
The Tesla show at Houston, America#JaiShreeRam #AyodhaRamMandir pic.twitter.com/REPmQSBZ1q
— SINGH___Jee (@BADALSINGH20450) January 20, 2024
” అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంలో మేము టెస్లా రామ్ భగవాన్ సంగీత కచేరీ నిర్వహించాము. గత 500 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం కోసం పోరాడుతున్న హిందువులందరికీ మేము ఎన్నో కృతజ్ఙతలు తెలుపుతున్నామని అమెరికా వరల్డ్ హిందూ కౌన్సిల్ ప్రెసిడెంట్ మహేంద్ర సాపా తెలిపారు.
అమెరికాలో రామ మందిర వేడుకలకు సారథ్యం వహిస్తున్న వీహెచ్‌పీ అమెరికా శనివారం 21 నగరాల్లో కార్ ర్యాలీలు నిర్వహించగా మరో పక్క విశ్వహిందూ పరిషత్ 10కి పైగా రాష్ట్రాల్లో 40కి పైగా పెద్ద బిల్‌బోర్డ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
Also read: ఎవరీ మోహిత్ పాండే..అతనినే అయోధ్య రామ మందిర ప్రధానార్చకునిగా ఎందుకు నియమించారు!