CM Jagan: జగన్‌పై దాడి.. భారీగా భద్రత పెంపు
AP: ఇటీవల సీఎం జగన్‌పై దాడి జరగడంతో ఆయన భద్రతపై పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌కు వ్యక్తిగత సిబ్బందిని భారీగా పెంచింది. బ్రౌన్ కలర్ డ్రెస్‌లో సఫారీ సూట్లో అదనంగా జగన్ వెంట 50 మంది వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసింది.
Sajjala Ramakrishna Reddy: ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు.. సజ్జల హాట్ కామెంట్స్
సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిని ఖండించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారన్నారు. నటన చంద్రబాబుకు అలవాటని.. నటించాల్సిన అవసరం జగన్‌కు లేదని పేర్కొన్నారు.
CM JAGAN: జగన్ పై దాడి.. భద్రతపై ఈసీ సీరియస్ యాక్షన్!
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడిని జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై రేపటిలోగా పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
Kodi kathi Srinivas: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ విడుదల
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. అతనికి ఎస్సీ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. కోడికత్తి శ్రీనివాస్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల జైలు శిక్ష తరువాత శ్రీనివాస్ విడుదల అయ్యాడు.