Allu Arjun Pushpa 2 Movie : సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలామంది స్టార్ హీరోలు సైతం తమ సినిమాల విషయంలో ఈ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. కొన్ని సార్లు అవి వర్కౌట్ అవుతాయి. కొన్నిసార్లు నెగిటివ్ సెంటిమెంట్స్ కు భయపడుతుంటారు కూడా. కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే కచ్చితంగా ప్లాప్ అన్న టాక్ కూడా ఉంది. ఉదాహరణకు పూరి జగన్నాథ్ – ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’ రెండూ ప్లాప్స్ అయ్యాయి.
దీంతో వాళ్ళు మళ్ళీ సినిమా చేసేందుకు సాహసించలేదు. ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబోలో వచ్చిన ‘కంత్రి’, ‘శక్తి’ సినిమాల పరిసస్థితి కూడా ఇంతే. శ్రీను వైట్ల – మహేష్ కాంబోలో వచ్చి న ‘దూకుడు’ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగ రాయగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఆగడు’ అట్టర్ ప్లాప్ అయింది. ఈ సెంటిమెంట్స్ ను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో కూడా అదే చర్చ జరుగుతుంది. సుకుమార్ – బన్నీ కాంబోలో ఇప్పటివరకు ఆర్య, ఆర్య 2, పుష్ప ది రైజ్ సినిమాలు వచ్చాయి. త్వరలో ‘పుష్ప 2’ రాబోతుంది. ఇప్పటికే ఈ సీక్వెల్ పై భారీ ఎత్తున అంచనాలున్నాయి.
Also Read : ఆడియన్స్ ని మేమే చెడగొట్టాం.. హాట్ టాపిక్ గా మారిన దిల్ రాజు కామెంట్స్
అయితే ‘పుష్ప 2’ మూవీ ప్లాప్ అవుతుందని నెట్టింట డిబేట్ పెట్టారు. దానికి ఓ సెంటిమెంట్ ను ఉదాహరణగా చెబుతున్నారు. అదేంటంటే, సుక్కు – బన్నీ కాంబోలో వచ్చిన ఆర్య హిట్టయితే, ఆర్య 2 ప్లాప్ అయిందని, ఆ లెక్కన పుష్ప-1 హిట్టయింది కాబట్టి ‘పుష్ప 2′ ప్లాప్ అవుతుందని అంటున్నారు.
అయితే దీనికి బన్నీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ..’ అసలు ‘ఆర్య 2’ ప్లాప్ అని ఎవరన్నారు?, ‘ఆర్య 2’ హిట్ మూవీ, ఆ మూవీ రిలీజ్ టైం లో తెలంగాణా గొడవల వల్లే సరిగ్గా ఆడలేదు, అయినా ఆర్య 2 కు పుష్ప 2 కు సంబంధం ఏంటి? ‘పుష్ప 2’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ధీటుగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ‘ఆర్య 2’ మూవీ ప్లాప్ అనే అనలేం. ఎందుకంటే ఆ సినిమాలోని బన్నీ క్యారెక్టర్, అయాన్ డ్యాన్స్, మ్యూజిక్, సుకుమార్ స్టోరీ టెల్లింగ్.. ఇలా అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. కాకపోతే ఆ టైం లో కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.