Akhanda2: నటసింహం బాలకృష్ణ (Balakrishna),మాసివ్ డైరెక్టర్ బోయపాటి (Boyapati seenu) కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అనే మార్క్ క్రియేట్ చేసుకుంది. సింహ , లెజెండ్, అఖండ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొట్టిన ఈ కాంబోలో మళ్ళీ మూవీ ఎప్పుడెప్పుడా ఆని అందరూ ఎదురుచూస్తున్నారు. అఖండ ఇచ్చిన రీసౌండ్ ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. కోవిడ్ 19 తరువాత తక్కువ ధరకే టికెట్స్ ఉన్నా సరే .. కలక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీ తరువాత గోపిచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య వీర సింహా రెడ్డి మూవీ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక.. రీసెంట్ గా భగవంత్ కేసరితో రికార్డుల మోత మోగించాడు. ఇక. బోయపాటి స్కంద అంటూ రామ్ పోతినేనితో మూవీ తెరకెక్కించి ప్లాప్ మూటగట్టుకున్నాడు.
మరో హ్యాట్రిక్ కు శ్రీకారం
ఇప్పుడు బోయపాటి నెక్స్ట్ మూవీ మళ్ళీ బాలయ్యతోనే చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అఖండలో ద్విపాత్రల్లో బాలయ్యబాబు నటన నభూతో నభవిశ్యతి అనే రేంజ్లో ఉంది. ఇక.. అఖండ 2 (AKHANDA 2) అంతకుమించి ఆనేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అఖండ2 ఓ డిఫరెంట్ జానర్లో విభిన్న కథాంశంతో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కబోతోందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ అఖండ2 మూవీతో బాలయ్య బోయపాటి మరో హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతారని ఖచ్చితంగా చెప్పొచ్చు.
అఖండ నిర్మాత ఎవరంటే ..
అఖండ 2 చిత్రానికి నిర్మాతలు ఎవరు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అఖండ చిత్రాన్ని నిర్మించిన సంస్థ నిర్మాణంలో చేస్తారా.. లేదా వేరే సంస్థలో చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బోయపాటి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.బోయపాటికి ఈ అఖండ 2 విజయం చాలా కీలకం. అయితే ప్రస్తుతం బాలయ్య బాబీ కాంబోలో మూవీ ట్రాక్ లో ఉంది . ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఈ లోగా బోయపాటి బన్నీతో కమిటయిన ఓ ప్రాజెక్టు ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి. నందమూరి ఫ్యాన్స్ మాత్రం అఖండ 2 అప్డేట్ కోసం చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాబీ – బాలయ్య NBK 109 చిత్రం షూటింగ్ జరుపుకుంటూవుండగా .. బోయపాటి తో చేయబోయే మూవీ NBK 110 కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.