Akkineni Akhil’s Agent Movie Coming On OTT : అక్కినేని అఖిల్ హీరోగానటించిన ‘ఏజెంట్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ 28 న భారీ అంచనాల నడుమ విడుదలై అఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టారు. అఖిల్ కూడా ఎంతో కష్టపడ్డాడు సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడి డైట్ మైంటైన్ చేసి బీస్ట్ మోడ్ లో బాడీని పెంచాడు.
సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చివరికి ఏజెంట్ అఖిల్ కి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏజెంట్ రిజల్ట్ తో ఫుల్ డిసప్పాయింట్ అయిన అఖిల్ కొద్దిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ఇప్పటివరకు నెక్స్ట్ మూవీని కూడా ప్రకటించలేదు.ఇదిలా ఉంటే గత ఏడాది ఏప్రిల్ నెలలో థియేటర్స్ లోకి వచ్చిన ‘ఏజెంట్’ ఇప్పటిదాకా ఓటీటీ రిలీజ్ కి నోచుకోలేదు.
Also Read : పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. అప్పటి వరకు నో షూటింగ్స్!
ఈ నెలలోనే…
సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే విపరీతమైన నెగిటివ్ టాక్ రావడంతో చాలామంది ఆడియన్స్ థియేటర్లో సినిమాని చూడలేదు. దాంతో ఓటీటీలోకి వస్తే చూద్దామని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. గతంలో చాలాసార్లు స్ట్రీమింగ్కు వస్తుందని వార్తలు వచ్చినా అది జరగలేదు. అయితే తాజాగా ఈ సినిమా జూలైలో ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.