Aditi- Siddarth: అందరూ అనుకున్నట్లుగానే ప్రియుడు, నటుడు సిద్ధార్థ్ తో మూడుముళ్లకు సిద్ధమైంది అందాల భామ అదితిరావు హైదరీ. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు లోకం కోడై కూసిన విషయం తెలిసిందే. కాగా ఇన్నాళ్లకు తమ ప్రేమ వ్యవహారం నిజమేనని నిరూపించారు నటులు. అంతేకాదు ఏకంగా నిశ్చిత్తార్థం కూడా చేసుకుని రూమర్స్ ను నిజం చేస్తూ.. అభిమానులను ఆనందపరిచారు. అయితే ఈ విషయాన్ని కొద్ది రోజులు సీక్రెట్ గా దాచిన అదితి.. తన తల్లి ఒత్తిడితోనే సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నట్లు తెలిపింది.
View this post on Instagram
400 ఏళ్ల నాటి గుడిలో వేడుకలు..
ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అదితి.. ‘మన లైఫ్ లో జరిగే ముఖ్యమైన వాటిని స్పెషల్ గా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. అందుకే నా నిశ్చితార్థ వేడుకను 400 ఏళ్ల నాటి గుడిలో జరుపుకున్నా. ఆ దేవాలయంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. మా అమ్మ కారణంగానే ఎంగేజ్మెంట్ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేశాను. మా పెళ్లి గురించి తెలుసుకోవాలని ఎంతోమంది మా అమ్మకు ఫోన్లు చేశారు. ఆమె సమాధానం చెప్పలేకపోయింది. ‘దయచేసి నీ ఎంగేజ్మెంట్ విషయం మీడియాకు వెల్లడించు’ అని కోరింది. దీంతో నేను, సిద్ధార్థ్ పోస్ట్లు షేర్ చేశాం’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక మార్చి 27న వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో ఇరు కుటుంబాల పెద్దలు, బంధువుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.