Stree 2 Movie OTT : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ మూవీ ‘స్త్రీ 2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘స్త్రీ’ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాను అమర్ కౌశిక్ డైరెక్ట్ చేశారు.
ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాదిలోనే హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది. పెద్ద చిత్రాలతో పోటీ పడి మరీ అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Also Read : బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌజ్ లో అడుగుపెట్టనున్న బుల్లితెర నటి
కాగా త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘స్త్రీ 2’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్మెంట్ రానున్నట్లు సమాచారం. ఓటీటీ వెర్షన్ లో హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.